యూత్ ని అలరిస్తున్న 90 ఎం ఎల్ పాట

Published on Nov 10,2019 03:55 PM
ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న కార్తికేయ తాజాగా ''90 ఎం ఎల్ '' అనే చిత్రంలో నటిస్తున్నాడు. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని '' నాతో నువ్వుంటే చాలు '' అనే పాటకు యువత నుండి అద్భుత స్పందన వస్తోంది. యూత్ ని అలరించేలా ఈ పాట ఉండటంతో దానికి జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల కాగా ఆ టీజర్ ని కూడా ఆదరించారు.

ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత చేసిన హిప్పీ , గుణ 369 ,చిత్రాలు అంతగా ఆడలేదు దాంతో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ గా నటించాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హీరోగా నటిస్తున్న 90 ఎం ఎల్ చిత్రంపై కార్తికేయ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.