చిరుతో రొమాన్స్ చేయనున్న శృతి హాసన్

Published on Mar 11,2019 11:28 AM

మెగాస్టార్ చిరంజీవి తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది అందాల భామ శ్రుతి హాసన్ . చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . సైరా షూటింగ్ పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు చిరంజీవి . కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేయడం ఖాయమని తెలుస్తోంది . 

శృతి హాసన్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది అయితే గతకొంత కాలంగా సినిమాల్లో నటించడం లేదు . కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆశిస్తోందట . అయితే ఎంతో సీనియర్ అయిన చిరంజీవి పక్కన నటించడం అంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది . చిరు ముసలి హీరో శృతి హాసన్ యంగ్ పైగా కూతురు వయసున్న హీరోయిన్ కావడంతో ఈ జంట బాగుంటుందా ? అన్నది ఆలోచించాలి మరి .