యంగ్ హీరో ఉదయ్ కిరణ్ మృతి

Published on Feb 15,2020 08:46 PM

యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గుండెపోటుతో మరణించాడు. పరారే , ఫ్రెండ్స్ బుక్ సినిమాల్లో హీరోగా నటించిన నండూరి ఉదయ్ కిరణ్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. పరారే , ఫ్రెండ్స్ బుక్ చిత్రాల్లో హీరోగా నటించిన నండూరి ఉదయ్ కిరణ్ కాకినాడలో నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడు. గతకొంత కాలంగా మానసిక పరిస్థితి బాగోలేక ఇబ్బంది పడుతున్నాడు ఈ హీరో. ఆర్ధిక ఇబ్బందులకు తోడు విలాసవంతమైన జీవితం కోసం పలు వివాదాల్లో ఇరుక్కోవడమే కాకుండా డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు ఉదయ్ కిరణ్.

హైదరాబాద్ లో పలు సంఘటనల్లో చిక్కుకున్న ఉదయ్ జైలు జీవితం కూడా గడిపాడు. ఆ తర్వాత కాకినాడకు మకాం మార్చి అక్కడ కూడా మోసాలకు పాల్పడ్డాడు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించిన నండూరి ఉదయ్ కిరణ్ మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు ఉదయ్ కిరణ్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.