కోర్టుకి హాజరైన యంగ్ హీరో

Published on Nov 26,2019 12:59 PM
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూకట్ పల్లి కోర్టుకి హాజరయ్యాడు యంగ్ హీరో ప్రిన్స్. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ప్రిన్స్ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయానికి వస్తే........ ఈనెల 24 న బాచుపల్లి లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు మద్యం తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు యంగ్ హీరో ప్రిన్స్. శాంపిల్స్ సేకరించిన పోలీసులు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసారు.

దాంతో ఈరోజు కూకట్ పల్లి కోర్టుకి హాజరయ్యాడు ప్రిన్స్. మద్యం తాగి సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ వస్తున్న ప్రిన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు జడ్జి. జరిమానా కూడా విధించడంతో ఈ విషయం బయటకు పొక్కింది. మద్యం తాగి డ్రై చేయడం వల్ల ఘోరమైన యాక్సిడెంట్ లు జరుగుతున్నాయని తెలుస్తున్నప్పటికీ సినీ ప్రముఖులు మాత్రం తమ తప్పు తెలుసుకోవడం లేదు.