విమర్శలపై స్పందించిన కుర్ర డైరెక్టర్

Published on Feb 13,2020 11:51 PM

కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పై విమర్శలు తలెత్తడంతో ఎట్టకేలకు స్పందించాడు. అసలు '' అ '' సినిమా సీక్వెల్ కోసం నాని ని సంప్రదించలేదని తేల్చి చెప్పాడు. దాంతో తనపై వస్తున్న ట్రోలింగ్ కి సమాధానం చెప్పినట్లయింది కానీ నాని ని ఎందుకు కలవలేదు అన్నది మాత్రం మరోమారు మరో చర్చకు తావిచ్చేలా చేసింది. అ చిత్రాన్ని చేసినప్పుడే నాని కి ప్రశాంత్ వర్మకు విబేధాలు వచ్చాయని అప్పట్లో గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే ఆ సినిమా సీక్వెల్ కోసం నానిని సంప్రదించలేదంటే ఆ డిఫరెంట్స్ ఉన్నాయని చెప్పినట్లే అని అంటున్నారు.

అ చిత్రానికి అంతగా కలెక్షన్లు రాలేదు కానీ మంచి పేరొచ్చింది దర్శక నిర్మాతలకు. అ సినిమా తర్వాత సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తో కల్కి అనే చిత్రం చేసాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా బాగానే ఉన్నా అంతగా హిట్ అవ్వలేదు దాంతో అ సీక్వెల్ పై కూర్చున్నాడు. ఈ కథ బాగా వచ్చిందట ! కాకపోతే ఆ సినిమాని ఫ్యాషన్ గా నిర్మించే నిర్మాత కావాలని ట్వీట్ చేసాడు ప్రశాంత్ వర్మ. మరి ఎవరు ముందుకు వస్తారో ?