రోడ్డు ప్రమాదంలో యువనటుడు మృతి

Published on Oct 30,2019 12:53 PM
తమిళ యువ నటుడు '' మనో '' రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాట జరిగింది. మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన మనో పలు తమిళ చిత్రాల్లో నటించాడు. కెరీర్ మంచి ఊపందుకుంటోంది అని అనుకుంటున్న సమయంలో ఊహించని సంఘటన మనో కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సంఘటన వివరాలలోకి వెళితే ...... మనో తన భార్య తో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొని కారులో చెన్నై నగర వీధుల్లో షికారు చేస్తున్నాడు.

చెన్నై లోని మీడియన్ రహదారిలో వేగంగా వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ ని బలంగా తాకింది దాంతో కారు పల్టీలు కొట్టింది. కారు పల్టీలు కొట్టడంతో మనో అక్కడికక్కడే మృత్యువాత పడగా మనో భార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆమెని చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మనో భార్య పరిస్థితి సీరియస్ గా ఉందట. దీపావళి పండగ సంతోషం క్షణాల్లో ఆవిరి కావడంతో మనో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.