యాత్ర టాక్ ఎలా ఉందంటే

Published on Feb 08,2019 11:56 AM

స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం యాత్ర. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు ,అనసూయ , సుహాసిని, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన యాత్ర చిత్రం ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీగా విడుదలైంది. 

ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అభినయం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే జగపతిబాబు , సుహాసిని , రావు రమేష్ ల పాత్రలకు కూడా మంచి స్పందన వస్తోంది. సినిమా సెకండాఫ్ లో కొంత స్లో నెరేషన్ ఉన్నప్పటికీ వై ఎస్సార్ అభిమానులకు విపరీతంగా నచ్చడం అయితే ఖాయం.