యాత్ర సెన్సార్ రిపోర్ట్

Published on Jan 23,2019 10:40 AM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం యాత్ర . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు. హాట్ భామ  అనసూయ కీలక పాత్రలో నటించిన ఈ యాత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అద్భుతమైన నటన ప్రదర్శించారని కొనియాడారట సెన్సార్ సభ్యులు. 

పాదయాత్ర నేపథ్యం నుండి రాజశేఖర్ రెడ్డి చనిపోయేంత వరకు సాగిన యాత్ర చిత్రం ప్రేక్షకులకు అలరించేలా రూపొందిందని , సెన్సార్ సభ్యుల అభినందనలు మాలో నూతన ఉత్తేజాన్ని అందించామని అంటున్నారు ఆ చిత్ర బృందం. ఇక సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది  దాంతో ఫిబ్రవరి 8న ఈ యాత్ర విడుదల కానుంది.