ఎన్టీఆర్ తో పోటీ పడేంత మూర్ఖుణ్ణి కాదంటున్న హీరో

Published on Mar 07,2020 01:07 PM

ఎన్టీఆర్ , చరణ్ లు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పోటీ పడేంత మూర్ఖుణ్ణి కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు కన్నడ స్టార్ హీరో యష్ . తాజాగా ఈ స్టార్ హీరో కేజీఎఫ్ 2 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సంచలన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా , ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒకేసారి విడుదల కానుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించాడు హీరో యష్.

ఆర్ ఆర్ ఆర్ చిత్రం పాన్ ఇండియా చిత్రం అయినా దాని రేంజ్ వేరు దాంతో మా సినిమా పోటీ పడటం ఏంటి ? అలా జరిగే ప్రశ్నే లేదు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ అలాగే మేము నిరంతరం సంప్రదింపులు చేసుకుంటూనే ఉన్నాం. ఎవరి సినిమా ఎంతవరకు వచ్చింది ? ఎప్పుడు విడుదల అవుతోంది అన్న విషయాలపై మాకు స్పష్టత ఉంది అందుకే ఎన్టీఆర్ , చరణ్ లతో పోటీ పడే సాహసం చేయమని స్పష్టం చేసాడు యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట.