యండమూరి దర్శకుడిగా సక్సెస్ అవుతాడా ?

Published on Mar 02,2019 02:58 PM

నవలా రచయితగా ఒకప్పుడు స్టార్ హీరోలను మించిన పేరు ప్రఖ్యాతులు పొందాడు యండమూరి వీరేంద్రనాథ్ . అయితే అదంతా గతం ఎందుకంటే ఆ రోజుల్లో నవలలకు విపరీతమైన డిమాండ్ కానీ ఇప్పుడు కాలం మారింది . నవలా రచయితగానే కాకుండా పలు సినిమాలకు కథలు అందించి సూపర్ డూపర్ హిట్ లను అందుకున్నాడు యండమూరి కానీ మెగా ఫోన్ పట్టి మాత్రం ఫెయిలయ్యాడు . 

హాయిగా రచయితగా సాగిపోతున్న తరుణంలో మెగా ఫోన్ చేతబట్టి దర్శకుడిగా మారిన యండమూరి వీరేంద్రనాథ్ అపజయాన్ని అందుకున్నాడు . కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ దర్శకత్వం చేసాడు . త్వరలోనే యండమూరి దర్శకత్వం వహించిన '' దుప్పట్లో మిన్నాగు '' అనే సినిమా రిలీజ్ కానుంది . తీవ్రవాద నేపథ్యంలో తెరకెక్కిన ఈ దుప్పట్లో మిన్నాగు చిత్రంతో దర్శకుడిగా విజయం సాధిస్తాడా ? అంటే డౌటే అనిపిస్తోది ట్రైలర్ చూస్తుంటే.