జయంత్ సి పరాన్జీ ' నరేంద్ర' సినిమా లో నటించనున్న WWE రెజ్లింగ్ స్టార్ "ది గ్రేట్ ఖలీ".

Published on Jan 30,2019 02:47 PM

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (WWE) రెజ్లర్ 'ది గ్రేట్ ఖలీ' టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నరేంద్ర' సినిమా లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు ఈ ఏడడుగుల రెజ్లర్..  ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో,అమెరికన్ టీవీ షో ల్లో నటించిన ఖలీ బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కనిపించి అభిమానులను అలరించాడు.. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నీలేష్ ఎటి, ఇజబెల్లా  జంటగా నటిస్తున్నారు.. ఇండియా పాకిస్థాన్ నేపథ్యంతో సినిమా రూపొందనుండడంతో ఇస్లామిక్ దేశంలో  చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోగా,  ఈ సినిమా తో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.. ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది.. 

తారాగణం: నీలేష్ ఎటి, ఇజబెల్లా, ది గ్రేట్ ఖలీ

సాంకేతిక నిపుణులు : 

కథ మరియు దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ

నిర్మాత: ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల

సినిమాటోగ్రఫీ: విరీన్ తంబిదోరై

సంగీతం: రామ్ సంపత్

ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

డైలాగ్స్: హరీష్ కోయలగుండ్ల

ఫైట్స్ : వెంకట్

PRO: వంశీ-శేఖర్