త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చిన రైటర్

Published on Feb 08,2020 04:22 PM

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన '' అల ...... వైకుంఠపురములో '' చిత్ర కథ నాదే అంటూ ఓ రచయిత సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. దర్శకుడిగా త్రివిక్రమ్ కు అంతగా పేరు లేని సమయంలో నేను ఈ కథ చెప్పానని , 2013 లో రిజిస్టర్ కూడా చేయించానని అయితే అదే కథతో ఇన్నాళ్లకు సినిమా తీసి షాక్ ఇచ్చాడని , అసలు కథ నాదని కానీ నాకు చెప్పకుండా చౌర్యం చేసారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు కథా రచయిత కృష్ణ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన '' సుబ్బు '' చిత్రానికి కథ అందించిన కృష్ణ ఆ తర్వాత త్రివిక్రమ్ కు అల .... వైకుంఠపురములో అనే కథ చెప్పాడట. అయితే అప్పట్లో అది కుదరలేదు కానీ ఇన్నాళ్లకు తన కథ సినిమాగా రావడంతో షాక్ అయిన ఈ రచయిత త్రివిక్రమ్ ని కలవడానికి ట్రై చేసాడట కానీ కుదరకపోవడంతో ఈ ఆరోపణలు చేస్తున్నాడు. అయితే తెలుగులో ఇలా కాపీ ఆరోపణలు రావడం చాలా కామన్ అయిపొయింది.