వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్

Published on Feb 06,2020 10:22 PM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యింది. రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కేథరిన్ ట్రెసా , ఇసా బెల్లె అనే నలుగురు అందమైన భామలు ఈ చిత్రంలో హీరోయిన్ లుగా నటించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె ఎస్ రామారావు , వల్లభ నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14న ఈ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదల కానుంది. దాంతో ఈరోజు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 

ఇక ట్రైలర్ చూస్తుంటే విజయ్ దేవరకొండ పాత్రలో చాలా వెరీయేషన్స్ ఉన్నట్లే కనబడుతోంది. ఒక్కడే ప్రేమికుడు కానీ ప్రియురాళ్లు మాత్రం నలుగురు అందుకేనేమో వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ పెట్టారు. నలుగురు భామలు కూడా ఇంటిమేట్ సీన్లలో నటించారు. కాకపోతే రాశి ఖన్నా కు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది అంతే. డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్లాప్ అందుకున్న ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాపై మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ లేదు మరి.