భాగ్యరాజ్ పై మండిపడుతున్న మహిళలు

Published on Nov 28,2019 03:46 PM

తమిళ నటుడు భాగ్యరాజ్ పై తమిళనాడు మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే భాగ్యరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ భాగ్యరాజ్ మహిళలపై చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా ........ స్మార్ట్  సెల్ ఫోన్ వల్ల మహిళలు పక్కదారి పడుతున్నారని , పర పురుషుడి సాంగత్యం కోసం భర్తని , పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని మానవతా విలువలు మట్టిగలిసి పోతున్నాయని అందుకు కారణం స్మార్ట్ ఫోన్ మహిళలు వాడటమే అని వ్యాఖ్యానించడమే !

ఓ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న సమయంలో భాగ్యరాజ్ ఇలా మాట్లాడటంతో మహిళా లోకం భాగ్యరాజ్ పై మండిపడుతోంది. వెంటనే భాగ్యరాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భాగ్యరాజ్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికీ దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు భాగ్యరాజ్. తన మాటలకు కట్టుబడి ఉన్నానని అంటున్నాడు. ఈ లొల్లి ఎంత దూరం పోతుందో ఏంటో ?