ఆ సినిమా తెలుగులో రిలీజ్ కావడం లేదు

Published on Apr 09,2019 10:37 AM

2015 లో తెలుగులో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన చిత్రం టెంపర్ . ఎన్టీఆర్ ని మళ్ళీ సక్సెస్ రూట్ లోకి తెచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో '' అయోగ్య '' అనే టైటిల్ తో రీమేక్ చేసాడు హీరో విశాల్ . ఈ చిత్రాన్ని మే 10 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కానీ తెలుగులో మాత్రం రిలీజ్ కావడం లేదు . 

విశాల్ నటించిన ప్రతీ తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంది కానీ అయోగ్య మాత్రం రిలీజ్ కావడం లేదు . ఎందుకయ్యా అంటే ఎన్టీఆర్ యాక్షన్ ని నా యాక్షన్ ని పోల్చి చూస్తారు ప్రేక్షకులు అప్పుడు నా నటన తేలిపోవడం ఖాయం ఎందుకంటే తారక్ అద్భుత నటుడు దాని గురించి కొత్తగా చెప్పేదేముంది అందుకే అయోగ్య చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయం అని అప్పట్లోనే చెప్పాడు విశాల్ . 

అయితే కొంతమంది మాత్రం తప్పకుండా తెలుగులో రిలీజ్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారట . విశాల్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి . విశాల్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా నటించింది . మే 10 న రిలీజ్ కానున్న ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు విశాల్ .