మంచు విష్ణు ఓటర్ గా మెప్పిస్తాడా ?

Published on Mar 06,2019 10:38 AM

మంచు మోహన్ బాబు వారసుడిగా తెరంగేట్రం చేసాడు మంచు విష్ణు . అయితే ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతోంది కానీ హీరోగా ఇప్పటికి కూడా నిలదొక్కుకోలేకపోయాడు . ఇన్నేళ్ల కెరీర్ లో కేవలం మూడు  సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి . డీ , దేనికైనా రెడీ , ఈడో రకం ఆడో రకం చిత్రాలు మాత్రమే హిట్స్ మిగతావన్నీ ఘోర పరాజయాలు పొందాయి . 

ఇక ఇప్పుడేమో కొంత గ్యాప్ తీసుకొని ''ఓటర్ '' అనే చిత్రం చేసాడు . ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రాజకీయ నేపథ్యంలో ఓటు హక్కుకు ఉన్న విలువ ఏంటి ? అది ఎంత పవర్ ఫుల్ వెపనో చాటి చెప్పే కథాంశంతో ఓటర్ రూపొందింది . మరి ఈ సినిమాతోనైనా మంచు విష్ణు హిట్ కొడతాడా ? ప్రేక్షకులను మెప్పిస్తాడా ? చూడాలి .