ఆ నిర్మాతని ఆదుకునే హీరో ఎవరు ?

Published on Apr 09,2019 11:01 AM

ఒకప్పుడు అగ్ర నిర్మాతగా పట్టిందల్లా బంగారమే అయ్యింది . దాంతో ఆ నిర్మాత ఓ సినిమా ప్రకటించగానే బయ్యర్లు పోటీ పడేవాళ్ళు అలాగే నటీనటులు , హీరోలు , హీరోయిన్ లు కూడా ఆ నిర్మాత చిత్రాల్లో నటించాలని తహతహలాడే వాళ్ళు కానీ కాలం మారింది పట్టిందల్లా బంగారం అయ్యే ఆ నిర్మాత నిర్మించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్ లు అవ్వడం ఆస్థులు కర్పూరంలా కరిగిపోవడం జరిగింది . 

ఇక ఇప్పుడు ఆ నిర్మాత పరిస్థితి ఏంటంటే ....... ఎవరైనా పెద్ద హీరో దయతలచి డేట్స్ ఇస్తే తప్ప ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడలేడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు . ఇంతకీ ఎవరయ్యా ఆ నిర్మాత అంటే ...... ఎం ఎస్ రాజు . మహేష్ బాబు ని ఒక్కడు సినిమాతో స్టార్ ని చేసింది ఈ ఎం ఎస్ రాజే ! అలాగే వర్షం చిత్రంతో ప్రభాస్ ని స్టార్ ని చేసింది కూడా ఈ ఎం ఎస్ రాజే ! ఉదయ్ కిరణ్ కు మనసంతా నువ్వే చిత్రంతో  మరింత స్టార్ డం ని తెచ్చిపెట్టింది ఈ ఎం ఎస్ రాజే ! 

కానీ ఓ వెలుగు వెలిగిన ఈ నిర్మాత ఇపుడు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాడు . ఈ నిర్మాత ఒడ్డున పడాలంటే ఒకరు మహేష్ బాబు లేదంటే మరొకరు ప్రభాస్ డేట్స్ ఇవ్వాలి . ఈ ఇద్దరు హీరోలలో డేట్స్ ఇచ్చేది ఎవరు ? ఆదుకునేది ఎవరు ? అది కూడా కాలమే నిర్ణయించాలి .