చిరంజీవి ఇంట్లో పెద్ద పార్టీ ఇవ్వనున్నాడా ?

Published on Oct 25,2019 04:53 PM

మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో పెద్ద పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ ఎవరికో తెలుసా ...... 1980 స్టార్ బ్యాచ్ కి . 1980 లో దక్షిణాదిలోని నాలుగు బాషలలో స్టార్ లుగా వెలుగొందిన హీరోలు , హీరోయిన్ లతో కలిపి '' 80 '' స్టార్స్ అంటూ ఓ వేడుకని ప్రతీ ఏడాది చేస్తున్నారు. గత పదేళ్లుగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. స్టార్ లం అన్న విషయాన్నీ పక్కన పెట్టి చిన్న పిల్లల మాదిరిగా డ్రెస్ కోడ్ లతో ఫుల్లుగా ఎంజాయ్ చేయడమే ఈ పార్టీ ముచ్చట్లు.

అయితే ప్రతీ ఏడాది బెంగుళూర్ లోనో చెన్నై లోనో కొచ్చి లోనో జరిగేవి ఈసారి మాత్రం మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో తన ఇంట్లో కానీ లేదంటే ఫామ్ హౌజ్ లో కానీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. నవంబర్ లో ఎయిటీస్ బ్యాచ్ పార్టీకి  చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.