చిరంజీవి ఆ ఫ్యామిలీని ఆదుకుంటాడా ?

Published on Jan 30,2019 02:03 PM

చిరంజీవి మాస్ హీరోగా ఎదగడానికి నా భర్త ఫైట్ మాస్టర్ రాజు కారణమని కానీ ఆయన మా కుటుంబానికి ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపిస్తోంది. 80 వ దశకంలో చిరంజీవి తెలుగు సినిమాకు సరికొత్త ఊపుని తీసుకొచ్చాడు. అయితే చిరు కి అంతటి మాస్ ఇమేజ్ రావడానికి కారణం ఫైట్ మాస్టర్ రాజు రూపొందించిన యాక్షన్ ఎపిసోడ్స్ కారణం. 

ఫైట్ మాస్టర్ రాజు నా ఉన్నతికి కారణం అంటూ పలుమార్లు ప్రస్తావించారు చిరంజీవి . అయితే ఫైట్ మాస్టర్ రాజు చనిపోయి 9 ఏళ్ళు కావస్తున్నప్పటికి చిరంజీవి కానీ ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి సహాయం చేయలేదని ఇప్పుడైనా చిరంజీవి ఆర్ధిక సహాయం అందించాలని కోరుతోంది ఫైట్ మాస్టర్ రాజు భార్య . మరి చిరంజీవి స్పందిస్తాడా ? ఆర్ధిక సహాయం చేస్తాడా ?  చూడాలి.