దర్బార్ చిత్రాన్ని కొనేవాళ్ళు లేరా ?

Published on Nov 26,2019 12:55 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం దర్బార్. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. చాలాకాలం తర్వాత రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ దర్బార్ చిత్రాన్ని జనవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ కూడా ప్రకటించినప్పటికీ తెలుగులో ఈ చిత్రాన్ని కొనేవాళ్ళు లేకుండాపోయారు.

ఒకప్పుడైతే సినిమా కంప్లీట్ కాకముందే పోటీపడి సినిమాని కొనుక్కునే వాళ్ళు కానీ కాలం మారింది గతకొంత కాలంగా రజనీకాంత్ నటిస్తున్న చిత్రాలన్నీ ఘోరంగా దెబ్బ తింటున్నాయి దాంతో బయ్యర్ లతో పాటుగా ఈ సినిమాని హోల్ సేల్ గా కొన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అందుకే దర్బార్ ని కొనడానికి ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. అయితే రజనీకాంత్ హీరో కాబట్టి తప్పకుండా ఎవరో ఒకరు కొంటారు కాకపోతే దర్బార్ నిర్మాతలు ఆశించిన రేటు మాత్రం రావడం కష్టమే !