విజిల్ వీకెండ్ కలెక్షన్స్విజిల్ వీకెండ్ కలెక్షన్స్

Published on Oct 28,2019 05:26 PM

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన విజిల్ మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 6. 50 కోట్ల షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టిస్తోంది. తెలుగులో విజయ్ కి పెద్దగా మార్కెట్ లేదు , తమిళనాట స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం పెద్దగా మార్కెట్ లేకుండాపోయింది. చాలా సంవత్సరాలుగా ఇక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేయాలనీ చూస్తున్నాడు కానీ ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. తుపాకీ , సర్కార్ , అదిరింది , చిత్రాలతో మంచి మార్కెట్ ఏర్పడింది కట్ చేస్తే ఇప్పుడు విజిల్ తో మరింత పెరిగింది. అక్టోబర్ 25 న విడుదలైన విజిల్ రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం                  -  1. 92 కోట్ల షేర్
సీడెడ్                    -  1. 65 కోట్లు
కృష్ణా                      -  44 లక్షలు
గుంటూరు               -  81 లక్షలు
ఈస్ట్                         -  45 లక్షలు
వెస్ట్                           -  29 లక్షలు
నెల్లూరు                      -  27 లక్షలు
వైజాగ్                          -  67 లక్షలు
మొత్తం                        -  6. 50 కోట్ల షేర్