సిమ్రాన్ కు ఏమైంది

Published on Sep 20,2019 05:06 PM
2000 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ సిమ్రాన్. తెలుగు , తమిళ భాషల్లో పలు చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకు గుడ్ బై చెప్పింది , ఇప్పుడేమో సహాయ పాత్రల్లో తమిళ చిత్రాల్లో నటిస్తోంది అయితే తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఓ ఫోటో సంచలనం సృష్టిస్తోంది. సిమ్రాన్ పోస్ట్ చేసిన ఫోటో లో చాలా బలహీనంగా కనబడుతోంది సిమ్రాన్.దాంతో ఈ భామకు ఏమైంది అన్న చర్చ , ఆత్రుత మొదలయ్యింది.

తెలుగులో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది సిమ్రాన్. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సిమ్రాన్ అందవిహీనంగా కనిపిస్తుండటంతో అసలు ఈ భామకు ఏమైంది అన్న చర్చ సాగుతోంది. అయితే వయసు మీద పడటం అలాగే ఇంతకుముందు ఉన్న స్టార్ డం లేకపోవడం తదితర కారణాల వల్ల ఇలా అయిపోయి ఉండొచ్చు అని అంటున్నారు పలువురు.