ఇండస్ట్రీ హిట్టు పై అల్లు అర్జున్ ఏమన్నాడంటే !

Published on Jan 28,2020 02:58 PM

సంక్రాంతి బరిలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ నటించిన అల ...... వైకుంఠపురములో చిత్రాలు ఒకరోజు తేడాలో విడుదల అయ్యాయి. ఆ సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించాయి అయితే ఇద్దరు కూడా మా సినిమా నెంబర్ వన్ అంటే మా సినిమా నెంబర్ వన్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరు ఏమి అనుకుంటారు అనేది వదిలేసి పోటీ ప్రచారం చేస్తున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ అంటూ చేసుకుంటున్న ప్రచారం పై స్పందించాడు.

ఇండస్ట్రీ హిట్ అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు , అయినా ఈ రికార్డులు శాశ్వతం ఏమి కాదు ఎందుకంటే ఒక సినిమా సాధించిన రికార్డ్ ని మరో సినిమా బద్దలు కొట్టడం ఖాయం. వాటిని పక్కన పెట్టి ఏ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో అది మాత్రమే శాశ్వతం అని అంటున్నాడు అల్లు అర్జున్. మొత్తానికి రికార్డుల గోల పక్కకు పోయిందన్న మాట. అయితే ఇంతలా చెబుతున్నప్పటికీ పోస్టర్ లను మాత్రం పోటీపడి వదులుతున్నారు రెండు సినిమాల వాళ్ళు.