వరంగల్ నేపథ్యంలో వరుణ్ సందేశ్ సినిమా

Published on Nov 24,2019 05:23 PM

వరంగల్ నగరానికి ఎంతో వైభవం ఉంది అందుకే ఆ చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా చేయాలనే ఆలోచన ఉందని అంటున్నాడు హీరో వరుణ్ సందేశ్. బిగ్ బాస్ 3 హౌజ్ లో 105 రోజుల పాటు ఉండి వచ్చిన వరుణ్ సందేశ్ తాజాగా హన్మకొండలో ఓ సెలూన్ షాప్ ఓపెనింగ్ కు వచ్చాడు. ఆ సందర్బంగా వరుణ్ సందేశ్ ని చూడటానికి జనాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇక అక్కడ మీడియాతో మాట్లాడిన వరుణ్ సందేశ్ వరంగల్ నేపథ్యంలో సినిమా చేయాలనీ ఉందని , వరంగల్ కోట , వేయి స్థంబాల గుండి , రామప్ప , లక్నవరం ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్న జిల్లా వరంగల్ అంటూ కొనియాడాడు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ చిత్రంతో స్టార్ గా ఎదిగిన వరుణ్ సందేశ్ గతకొంత కాలంగా రేసులో లేకుండాపోయాడు వరుస పరాజయాలతో.