వార్ ట్రైలర్ టాక్

Published on Aug 27,2019 01:52 PM

హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం వార్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ పూర్తిగా యాక్షన్ దృశ్యాలతో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఇప్పటికే టీజర్ తో సంచలనం సృష్టించిన వార్ తాజాగా విడుదలైన ట్రైలర్ తో ప్రభంజనం సృష్టించేలా ఉంది. భారీ యాక్షన్ దృశ్యాలతో తెరకెక్కిన వార్ ట్రైలర్ 2 నిమిషాలకంటే ఎక్కువ నిడివి ఉంది. 

ఈ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ వార్ సినిమా అక్టోబర్ 2 న విడుదల కానుంది. హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ ల ఆమధ్య భీకర పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్ ని , మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉన్నాయి. హృతిక్ రోషన్ కబీర్ గా నటిస్తుండగా టైగర్ ష్రాఫ్ ఖలీద్ గా నటిస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అవుతుండటం విశేషం.