కరోనా పై యుద్ధం అయిపోలేదంటున్న పూరి

Published on Mar 30,2020 11:44 PM
అప్పుడే యుద్ధం అయిపోయిందని అనుకోవద్దు ఎందుకంటే యుద్ధం ఇంకా అయిపోలేదు అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అందుకు అందరం సిద్ధంగా ఉండాలంటూ ఉదాహరణలు కూడా చెబుతున్నాడు దర్శకులు పూరి జగన్నాధ్. కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.

21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా రోజు వారీ కూలీలు , మధ్యతరగతి ప్రజలు. ఇంకా 10 రోజులు కూడా కాకముందే ఇన్ని ఇబ్బందులు ఉంటే మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉంటే పరిస్థితి ఏంటి ? అన్న ఊహే భరించలేకపోతున్నారు ప్రజలు. అయితే ఇంకా 15 రోజులు అని మాత్రమే ఆలోచిస్తున్నారు నెలలు కావచ్చు , సంవత్సరాలు పట్టొచ్చు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అంటూ పూరి చెబుతున్న డైలాగ్ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది.