శివాజీరాజా - నరేష్ ల గొడవకు అంతే లేదా !

Published on Mar 18,2019 03:39 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు శివాజీరాజా - నరేష్ ల మధ్య మరింత అగాధాన్ని పూడ్చింది . ఎన్నికలకు ముందే శివాజీరాజా - నరేష్ ల ఆమధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండే , ఎన్నికలయ్యాక అది ఇంకా ఎక్కువయ్యింది .ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే . దాంతో  ఈనెల 22న నరేష్ పదవి ప్రమాణ స్వీకారం చేయాలనీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు . కానీ శివాజీరాజా అడ్డం తిరిగాడు . 

నా పదవి కాలం మార్చి 31 వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు నేనే అధ్యక్షుడిని , నరేష్ ఆ పదవిలో కూర్చోవడానికి వీలు లేదు అంటూ హెచ్చరికలు జారీ చేసాడట దాంతో నరేష్ మీడియా ముందుకొచ్చాడు . ఈ ఇద్దరి మధ్య ఇంతగా గొడవలు జరుగుతున్నప్పటికీ సినిమా పెద్దలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు . మరి ఇప్పుడైనా పెద్దలు జోక్యం చేసుకుంటారో లేదో చూడాలి .