ప్రభాస్ - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య లొల్లి

Published on Apr 15,2019 04:43 PM

ప్రభాస్ - విజయ్ దేవరకొండ ల ఫ్యాన్స్ ల మధ్య లొల్లి షురూ అయ్యింది . ఈ ఇద్దరు అభిమానులు ఎందుకు గొడవ పడుతున్నారో తెలుసా ...... అర్జున్ రెడ్డి చిత్రం కంటే కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ నటన బాగుందని ప్రభాస్ పేర్కొనడమే నట ! అర్జున్ రెడ్డి చిత్రం రిలీజ్ అయ్యింది తెలుగునాట సంచలనం సృష్టించింది అంతేకాదు విజయ్ దేవరకొండ ని స్టార్ ని చేసింది. కబీర్ సింగ్ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు కాకపోతే షూటింగ్ చివరి దశలో ఉంది మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయ్ కూడా . అయితే ప్రభాస్ షాహిద్ కపూర్ కు ఫోన్ చేసి అర్జున్ రెడ్డి చిత్రంలో కంటే అద్భుతంగా నటించావు అంటూ చెప్పాడట ! ఈ విషయం బయటకు పొక్కడంతో ఓ ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది . ఇంకేముంది ఆ కథనం ప్రకారం ప్రభాస్ - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య లొల్లి మొదలయ్యింది . మా హీరో కంటే గొప్పగా నటించాడా ? ఇంకా సినిమా నే రిలీజ్ కాలేదు అప్పుడే పొగడ్తల ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ .