రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కోసం హీరో వెయిటింగ్

Published on Nov 30,2019 01:20 PM

తనకు మంచి సూపర్ హిట్ చిత్రాన్ని చేసే ఛాన్స్ ఇస్తే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసిన హీరో రామ్, దాంతో రామ్ తో అనుకున్న సినిమాని రవితేజ తో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇంతకీ రామ్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ ఏంటో తెలుసా .......... .. . '' రాజా ది గ్రేట్ '' . ఈ సినిమాని మొదట రామ్ తో చేయాలనుకున్నాడు అనిల్ రావిపూడి అయితే హీరో గుడ్డివాడి పాత్ర కావడంతో అది చేస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారా ? అన్న మీమాంసలో ఆ సినిమాని రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే రవితేజ ధైర్యం చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఇంకేముంది సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న రామ్ ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అనిల్ రావిపూడి కూడా ఓ లైన్ చెప్పాడట రామ్ కు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రాన్ని చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అది అయ్యాక కానీ ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా ? లేదా ? అనేది తేలనుంది.