దిల్ రాజు బ్యానర్ లో విశ్వక్ సేన్

Published on Mar 12,2020 06:27 PM

అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో విశ్వక్ సేన్ నటించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే హిట్ సినిమాతో హిట్ కొట్టిన హీరో ఈ విశ్వక్ సేన్. వెళ్ళిపోమాకే సినిమాతో సినిమారంగంలోకి  ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఫలక్ నుమా దాస్ చిత్రంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో కట్ చేస్తే ఇటీవల హిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

హిట్ సినిమా విజయవంతం కావడంతో ఇప్పుడు దిల్ రాజు విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నరేష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడట. మాస్ ని అలరించే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న హీరో విశ్వక్ సేన్ అతడికి తగ్గట్లుగా మరో బ్లాక్ బస్టర్ పడితే తప్పకుండా ఈ హీరో రేంజ్ మరో లెవల్ లో ఉండటం ఖాయమని భావిస్తున్నారట.