హిట్ ట్రైలర్ తో వచ్చిన విశ్వక్ సేన్

Published on Feb 19,2020 02:50 PM

విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదల అయ్యింది. హీరో నాని నిర్మించిన హిట్ చిత్రం ఈనెల 28 న విడుదల కానుంది. ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలాగే కనబడుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను కోరుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చొచ్చు. అయితే హిట్ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది ఈనెల 28 న తేలనుంది.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ చిత్ర ట్రైలర్ ని ఈరోజు విడుదల చేసారు. ఆ ట్రైలర్ చూస్తుంటే కిడ్నాప్ మిస్టరీ గా అనిపిస్తోంది. రేవతి అనే యువతి కిడ్నాప్ నేపథ్యంలో సాగే విచారణగా అనిపిస్తోంది హిట్. అలాగే హీరో విశ్వక్ సేన్ కూడా మానసిక వ్యాధితో బాధపడే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి సస్పెన్స్ బాగానే ఉంది అది ఏ మోతాదులో అన్నది ప్రేక్షకులు తేల్చనున్నారు. ఫలక్ నుమా దాస్ చిత్రంతో ఫేమస్ అయిన విశ్వక్ సేన్ కు హిట్ సినిమా హిట్ ఇస్తుందా ? నానిని నిర్మాతగా నిHiలబడుతుందా చూడాలి.