వర్మతో సినిమా చేయనంటున్న హీరో

Published on Mar 02,2020 12:14 PM

ఫలక్ నుమా దాస్ చిత్రంతో సంచలనం సృష్టించిన విశ్వక్ సేన్ దర్శకులు రాంగోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. వర్మతో మందు తాగుతాను కానీ సినిమా మాత్రం చేయను అని కుండబద్దలు కొట్టాడు. రాంగోపాల్ వర్మ మంచి మద్యం ప్రియుడు అలాగే అమ్మాయిలతో సరదాగా గడుపుతుంటాడు కూడా. అలాగే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కూడా. దర్శకుడిగా సంచలన విజయాలు అందుకున్న వర్మ గతకొంత కాలంగా పరమచెత్త చిత్రాలను తీస్తున్నాడు.

అందుకే కాబోలు విశ్వక్ సేన్ వర్మతో పార్టీ చేసుకుంటాను కానీ సినిమాల్లో మాత్రం నటించను అని చెప్పింది. తాజాగా ఈ హీరో నటించిన '' హిట్ '' చిత్రం రేపు విడుదల అవుతోంది. నాని నిర్మించిన ఈ చిత్రంపై నాని తో పాటుగా విశ్వక్ సేన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.