సూపర్ హిట్ కొట్టేసిన విశ్వక్ సేన్

Published on Mar 02,2020 12:05 PM
విశ్వక్ సేన్ ఎట్టకేలకు సూపర్ హిట్ కొట్టాడు. ఫలక్ నుమా దాస్ తో కమర్షియల్ గా మెప్పించినప్పటికి అది ఆశించిన హిట్ మాత్రం కాదు కాని తాజాగా విశ్వక్ సేన్ నటించిన హిట్ చిత్రం మాత్రం సూపర్ హిట్ అయ్యింది. నిన్న విడుదలైన హిట్ చిత్రానికి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వస్తోంది. ఇక మంచి ఓపెనింగ్స్ లభించడమే కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇంకా మంచి స్పందన వస్తుండటంతో హీరో నాని చాలా సంతోషంగా ఉన్నాడు. 

హీరో నాని సంతోషించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఎందుకంటే హీరో నాని ఈ చిత్రానికి నిర్మాత మరి. ఒక హీరో అయి ఉండి మరో హీరోతో సినిమా నిర్మించడం నాని ప్రత్యేకత. ఇక విశ్వక్ సేన్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి హిట్ సినిమా విజయం సాధించడంతో. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిట్ చిత్రం నిన్న విడుదల అయ్యింది. విశ్వక్ సేన్ నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి.