ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్

Published on Apr 18,2020 03:09 PM
యంగ్ హీరో విశ్వక్ సేన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇంతకీ ఈ హీరో ఎన్టీఆర్ ని ఏమన్నాడో తెలుసా ..... సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని. అవును డ్యాన్స్ అయినా , ఫైట్స్ అయినా , యాక్టింగ్ అయినా ఏదైనా సరే సింగిల్ టేక్ లో చేసేంత దమ్మున్న హీరో , నా అభిమాన హీరో ఎన్టీఆర్ అంటూ ప్రశంసలు కురిపించాడు విశ్వక్ సేన్. ఈనగరానికి ఏమైంది , ఫలక్ నుమా దాస్ , హిట్ వంటి చిత్రాల్లో నటించి సంచలనం సృష్టించిన హీరో విశ్వక్ సేన్.

ఎన్టీఆర్ ని మాత్రమే కాదు మహేష్ బాబు , అల్లు అర్జున్ లపై కూడా తన మనసులోని మాట చెప్పాడు. మహేష్ బాబు చాలా చాలా అందగాడని అలాగే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అంటూ కీర్తించాడు. ఇక నాని అన్న అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని , ఒకవేళ మల్టీస్టారర్ చిత్రం అంటూ చేయాల్సి వస్తే నాని అన్నతో చేస్తానని తెలిపాడు విశ్వక్ సేన్. ఇటీవలే హిట్ చిత్రంతో హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనీ చూస్తున్నారు అయితే కరోనా రావడంతో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి.