విశాల్ అయోగ్య టీజర్ టాక్

Published on Feb 07,2019 11:11 AM

మాస్ హీరో విశాల్ నటించిన అయోగ్య చిత్ర టీజర్ నిన్న విడుదల చేసారు దర్శకులు మురుగదాస్ . తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రానికి రీమేక్ ఈ అయోగ్య . 2015 లో రిలీజ్ అయిన టెంపర్ సూపర్ హిట్ అయి ఎన్టీఆర్ కు మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చింది . ఇక ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో సింబా గా రీమేక్ చేసారు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది . దాంతో అయోగ్య పై భారీ అంచనాలు నెలకొన్నాయి . 

ఇక ఈ టీజర్ మరోసారి విశాల్ ని మాస్ కు దగ్గరగా చేసేలా ఉంది . రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సన్నీ లియోన్ చేత ఐటెం సాంగ్ చేయిస్తున్నారు . టీజర్ కు  బ్రహ్మరథం పడుతున్నారు విశాల్ అభిమానులు . ఎన్టీఆర్ కు టెంపర్ లాగే విశాల్ కు అయోగ్య అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విశాల్ అభిమానులు .