కేరళ అడవుల్లో విరాటపర్వం

Published on Jan 18,2020 02:47 PM

కేరళ లోని దట్టమైన అటవీప్రాంతంలో విరాటపర్వం షూటింగ్ కొనసాగుతోంది. 1980 -90 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలపై ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. పోలీస్ - నక్సల్స్ మధ్య అప్పట్లో జరిగిన యుద్ధ వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు ఉడుగుల వేణు. నీది నాది ఓకే కథ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి సక్సెస్ అందుకున్న వేణు తాజాగా విరాటపర్వం కు శ్రీకారం చుట్టాడు.

ఇప్పటికే వరంగల్ పరిసర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకున్నఈ  చిత్రాన్ని కేరళ షెడ్యూల్ తో  దాదాపుగా  70 శాతం షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు. మిగతా షూటింగ్ ని వేసవి నాటికీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం. విరాటపర్వం తన కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలిచి పోతుందని భావిస్తున్నారు హీరో రానా. ఈ సినిమా అయ్యాక హిరణ్య కశ్యప చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.