వినయ విధేయ రామ 10 రోజుల వసూళ్లు

Published on Jan 21,2019 05:58 PM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 61 కోట్ల షేర్ ని సాధించింది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో చరణ్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటించగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు . ప్రశాంత్ , స్నేహ , ఆర్యన్ రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న విడుదలైంది . సినిమా ప్లాప్ అయినప్పటికీ మాస్ సినిమా కావడంతో మంచి వసూళ్లు వస్తున్నాయి . 

వినయ విధేయ రామ సాధించిన షేర్ ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా  ఇలా ఉంది  . 

నైజాం                         -  12 . 50 కోట్లు 

సీడెడ్                          -  11. 55 కోట్లు 

ఉత్తరాంధ్ర                  -  8. 05 కోట్లు 

గుంటూరు                    -  6. 26 కోట్లు 

కృష్ణా                            -  3. 56 కోట్లు 

వెస్ట్                               -  4. 25 కోట్లు 

ఈస్ట్                              -  5. 23 కోట్లు 

నెల్లూరు                        -  2. 77 కోట్లు 

ఓవర్ సీస్                      -  1. 40 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా       -  5. 35 కోట్లు 

మొత్తం                           -  60. 92 కోట్లు