కొడుకు సినిమా హిట్ కావడంతో పరవశించిపోతున్న తండ్రి

Published on Nov 25,2019 11:44 AM

తమిళంలో ఈనెల 22 న విడుదలైన ఆదిత్య వర్మ విడుదలై సంచలన విజయం సాధించడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు ఆ హీరో తండ్రి తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో '' ఆదిత్య వర్మ '' గా రీమేక్ చేసారు. ఈ చిత్రంతో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అయ్యాడు. మొదట ఈ చిత్రానికి సీనియర్ దర్శకులు బాల దర్శకత్వం వహించాడు అయితే రష్ చూసుకున్నాక ఆశించిన స్థాయిలో సినిమా లేదని ఫిక్స్ అయిన చిత్ర బృందం బాల ని పక్కన పెట్టి గిరీశాయా కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.

ఇక ఇటీవలే విడుదలైన ఆదిత్య వర్మ చిత్రానికి తమిళ ప్రేక్షకులు జేజేలు పలుకుతుండటంతో చెన్నై లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఆ వేడుకలో పాల్గొన్న హీరో విక్రమ్ తన తనయుడి మొదటి సినిమా పెద్ద విజయం సాధిస్తుండటంతో చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రిగా కొడుకు విజయానికి పరవశించిపోతున్నాడు.