యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Published on Sep 05,2019 08:45 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కోనుగంటి కి ఛాన్స్ ఇచ్చాడట! హుషారు అనే చిత్రానికి దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. హుషారు చిత్రం బిసి కేంద్రాల్లో బాగానే ఆడింది , హుషారు అనే సినిమా కంటే '' ఉండిపోరాదే '' అంటూ సాగే పాట ఉన్న చిత్రం అంటే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది ఎందుకంటే ఆ పాట అంతగా సంచలనం సృష్టించింది మరి.
అసలు తన మొదటి సినిమానే విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నాడు శ్రీహర్ష కోనుగంటి. కానీ కుదరలేదు దాంతో ఇప్పుడు రెండో ప్రయత్నంగా అతడితో సినిమా చేయాలని కథ చెప్పాడట! ఆ కథ విజయ్ దేవరకొండకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాకపోతే ఈ సినిమా 2020 లో సెట్స్ మీదకు వెళ్లనుంది.