మాఫియా డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ

Published on Sep 09,2019 11:14 AM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మాఫియా డాన్ కొడుకుగా నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో అండర్ వరల్డ్ డాన్ కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నాడట. మాఫియా డాన్ కొడుకు అయినప్పటికీ ఫైటర్ గా కనిపించనున్నాడట ఈ క్రేజీ హీరో.
ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్నాడు పూరి జగన్నాధ్ , దాంతో విజయ్ దేవరకొండ కూడా వెంటనే డేట్స్ ఇచ్చాడు. నవంబర్ లేదా జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇక ఫైటర్ చిత్రాన్ని 2020 వేసవిలో విడుదల చేయాలనీ భావిస్తున్నారట పూరి. ఈ దర్శకుడు సినిమా మొదలు పెడితే శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ సరసన నటించే భామలను ఫైనల్ చేయాల్సి ఉంది.