పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇళయ దళపతి సినిమా

Published on Feb 13,2020 11:47 PM
ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సంచలన చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. తనని కొంత కాలంగా రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న నాయకుల తీరుపై చాలా ఆగ్రహంగా ఉన్నాడు విజయ్. దాంతో ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకొని సినిమా చేయాలనే తలంపుతో ఉన్నాడట. అలాగే వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జయలలిత - కరుణానిధి లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఆ స్థాయి మజా లేదు.

అయితే వాటిని భర్తీ చేయడానికి కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టగా రజనీకాంత్ కూడా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరికీ తోడు విజయ్ కూడా రాజకీయ ప్రసంగాలు చేయడం ఖాయమని అయితే ఎవరి పక్షాన నిలబడతాడో అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ విషయాన్నీ పక్కన పెడితే తనని ఇబ్బంది పెడుతున్న రాజకీయ వ్యవస్థని చీల్చి చెండాడే కథతో పొలిటికల్ చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట విజయ్.