విజయ్ దేవరకొండ సరసన హాట్ భామ

Published on Sep 27,2019 04:54 PM

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించి అందాలను ఉదారంగా ఆరబోసిన భామ నభా నటేష్. తాజాగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తరచుగా అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతున్న ఈ భామని విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న ఫైటర్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేయనున్నారట దర్శకులు పూరి జగన్నాధ్.

ఇప్పటికే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించిన నభా నటేష్ ఆ చిత్రంలో నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఇక ఇప్పుడేమో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయనుంది. అయితే ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది పూరి అండ్ కో. విజయ్ దేవరకొండ తో నభా నటేష్ ఏ స్థాయిలో రొమాన్స్ చేయనుందో చూడాలి.