విజయ్ దేవరకొండ సినిమా హిందీలో ?

Published on Oct 23,2019 03:21 PM
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం హిందీలో రీమేక్ అవుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసింది దాంతో విజయ్ దేవరకొండ చిత్రాలకు గిరాకీ ఏర్పడింది. దాంతో టాక్సీ వాలా అనే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా ఇషాన్ కట్టర్ నటిస్తున్నాడు. తెలుగులో టాక్సీ వాలా చిత్రం ఎన్నో ఇబ్బందులను అధిగమించి విజయం సాధించింది. రిలీజ్ కి ముందే సగానికి పైగా సినిమా పైరసి బారిన పడింది అయినప్పటికీ ధైర్యం చేసి టాక్సీ వాలా ని కాస్త ఆలస్యంగానైనా విడుదల చేసారు. లక్కీ గా మంచి హిట్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ దేవరకొండకు మరింత మార్కెట్ పెరిగేలా చేసింది . మరి హిందీలో ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో .