అల్లు అర్జున్ పాలిట విలన్ గా మారుతున్న విజయ్

Published on Oct 28,2019 06:25 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాలిట విలన్ గా మారుతున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి తమిళ పెద్ద హీరో అయినప్పటికీ విలక్షణ పాత్రలను చేయడంలో దిట్ట. తన ఇమేజ్ ని పక్కన పెట్టి చిన్న పాత్రలను , విలన్ పాత్రలను అనే తేడా లేకుండా చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా విజయ్ సేతుపతి నటించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పుడు మరో తెలుగు సినిమాలో విజయ్ సేతుపతి నటించడానికి సిద్ధం అయ్యాడట. అల్లు అర్జున్ - సుకుమార్ ల కాంబినేషన్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో అల్లు అర్జున్ హీరో కాగా విలన్ గా విజయ్ సేతుపతి ని అనుకుంటున్నారట. అల వైకుంఠపురములో చిత్రం కంప్లీట్ అయ్యాక సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు అల్లు అర్జున్