భీభత్సం సృష్టించిన విజయ్ ఫ్యాన్స్

Published on Oct 25,2019 04:30 PM

తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ భీభత్సం సృష్టించారు. ఈరోజు విజయ్ నటించిన బిగిల్ చిత్రం విడుదల అవుతుండటంతో అర్ధరాత్రి నుండే థియేటర్ ల దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు అభిమానులు. విజయ్ స్టార్ హీరో కాబట్టి స్టార్ హీరోల చిత్రాలకు ముందుగానే షోలు వేస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో విజయ్ అభిమానులు క్రిష్ణగిరి లోని థియేటర్ కు వచ్చారు. అయితే స్పెషల్ షో లేదని చెప్పడంతో షాక్ అయిన విజయ్ అభిమానులు భీభత్సం సృష్టించారు.

థియేటర్ ని ద్వ0స్వం చేసారు అంతేనా పోలీస్ వాహనాలను అలాగే సమీపంలోని పలు దుకాణాలకు కూడా నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున రెచ్చిపోవడంతో ఫ్యాన్స్ ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడమే కాకుండా పలువురు విజయ్ అభిమానులను అరెస్ట్ చేసారు.