1.3 కోట్ల విరాళం ప్రకటించిన హీరో విజయ్

Published on Apr 23,2020 04:25 PM
ఇళయదళపతి విజయ్ ఒక కోటి ముప్పై లక్షల విరాళాన్ని ప్రకటించాడు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు బాసటగా నిలవాలని భావించిన విజయ్ ఈ మొత్తాన్ని ప్రకటించాడు. ఈ మొత్తంలో 25 లక్షలు కేంద్ర ప్రభుత్వానికి , 50 లక్షలు తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లకు చెరో 5 లక్షల చొప్పున , దక్షిణ భారత సినీ సమాఖ్యకు 25 లక్షల విరాళం , కేరళ ప్రభుత్వానికి 10 లక్షలు , కర్ణాటక , పుదుచ్చేరి ప్రభుత్వాలకు చెరో 5 లక్షల చొప్పున మొత్తం 1.3 కోట్ల విరాళం ప్రకటించాడు విజయ్.

కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ప్రభుత్వాలకు అండగా నిలవాలని పిలుపునిస్తున్నాడు విజయ్. కనీస దూరం పాటించి కరోనా ని తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు విజయ్. తాజాగా ఈ హీరో మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా మేలో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా కలకలం వల్ల ఇప్పట్లో సినిమాలు విడుదల కావడం కష్టమే అని తెలుస్తోంది.