వరల్డ్ ఫేమస్ లవర్ గా విజయ్ దేవరకొండ

Published on Sep 20,2019 05:17 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రానికి '' వరల్డ్ ఫేమస్ లవర్ '' అనే టైటిల్ ని ఖరారు చేసారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె ఎస్ రామారావు - వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు భామలు రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , ఇజా బెల్లె లితే  నటిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది పాటలు మినహా.

విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు భామలు నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. యంగ్ జనరేషన్ కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయట ఈ చిత్రంలో. ఇక డియర్ కామ్రేడ్ దెబ్బతో బాధపడుతున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తాడో చూడాలి.