క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా టైటిల్‌ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌

Published on Sep 18,2019 05:09 PM

సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రానికి `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
 డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ సెన్సిబుల్ క‌థాంశంతో ఈ చిత్రాన్నిఅద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన మేక‌ర్స్ సెప్టెంబ‌ర్ 20, సాయంత్రం 5 గంట‌ల‌కు  ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  క్రాంతి మాధ‌వ్‌
నిర్మాత‌:  కె.ఎ.వ‌ల్ల‌భ‌
స‌మ‌ర్ప‌ణ‌:  కె.ఎస్‌.రామారావు
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
కెమెరా:  జ‌య‌కృష్ణ గుమ్మ‌డి
ఆర్ట్‌:  సాహి సురేశ్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌