విజయ్ దేవరకొండ అక్కడి నుండి వెళ్లిపోదామనుకున్నాడట

Published on Dec 31,2019 01:52 PM
ఇటీవల జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ ఆ సమావేశం నుండి బయటకు వెళ్ళిపోదామనిఅనుకున్నాడట ! ఎందుకంటే అక్కడ అన్నవాళ్ళందరూ గొప్ప గొప్పవాళ్ళు దాంతో అలాంటి గొప్పవాళ్ళ దగ్గర నేను చాలా చిన్నవాడిగా కనిపించానని అందుకే ఆ సమావేశం నుండి వెళ్లిపోవాలని అనుకున్నానని అయితే ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాల్గొన్న మీటింగ్ కాబట్టి సెక్యూరిటీ టైట్ గా ఉంటుంది కాబట్టి వెళ్లలేకపోయానని అన్నాడు.

ఇక చిన్నప్పటి నుండి కూడా తనకు నచ్చిన పనులు మాత్రమే చేసుకుంటూ వచ్చానని , అందరి కంటే ముందు ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రా చేయాలనే విషయం తెలుసుకున్నానని ఇప్పుడు అదే చేస్తున్నానని అన్నాడు విజయ్ దేవరకొండ. ఓ మీడియా ఛానల్ వాళ్ళు ఇచ్చిన అవార్డుల వేడుకలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఇలా మాట్లాడి అందరినీ నవ్వులలో ముంచెత్తాడు. తాజాగా ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.