విజయ్ దేవరకొండ సరికొత్త సంచలనం

Published on Dec 17,2019 03:47 PM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త సంచలనం సృష్టించాడు. ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ ని ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుసా ........ 5 మిలియన్ ఫాలోవర్స్. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ విజయ్ దేవరకొండని 5 మిలియన్ ఫాలోవర్స్ వెంటాడుతున్నారు. ఇంతమంది ఫాలో అవుతున్నారంటే విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రౌడీ హీరోగా గుర్తింపు పొందిన ఈ హీరో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు దాంతో ఈ రౌడీ హీరోని తెగ ఫాలో అవుతున్నారు అమ్మాయిలు ,అబ్బాయిలు.

ఇక తెలుగు హీరోలలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నది కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే సుమా ! టాలీవుడ్ లో స్టార్ హీరోలైన మహేష్ బాబు కు కేవలం 3 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు అలాగే ప్రభాస్ కు 4 మిలియన్ ఫాలోవర్స్ అలాగే అల్లు అర్జున్ కు కూడా 4 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు కానీ వాళ్ళని అధిగమించి విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే 5 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రాన్ని ఫిబ్రవరి 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.